Aadhaar Virtual ID Generation
కొత్తగా సిం కార్డు తీసుకుంటున్నా, బ్యాంక్ ఎకౌంట్ ఓపెన్ చేస్తున్నా ఆధార్ కార్డు నెంబర్ తప్పనిసరిగా చెప్పాల్సి వస్తుంది కదా.
ఇలా ఆధార్ కార్డు నెంబర్ ఎక్కడబడితే అక్కడ చెప్పడం వలన అది దుర్వినియోగమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇకపై ఎక్కడా అసలైన Aadhaar నెంబర్ చెప్పాల్సిన పనిలేదు అంటూ.. వర్చ్యువల్ ఐడి తయారుచేసుకుని దాన్ని షేర్ చేస్తే సరిపోతుంది అని UIDAI సంస్థ గతంలో ప్రకటించిన విషయం గుర్తుండే వుంటుంది.
ఆ మేరకు తాజాగా ఏర్పాట్లు కూడా చేసింది. ఇప్పుడు ఇండియాలో నివసిస్తున్న ఎవరైనా UIDAI వెబ్ సైట్ కి వెళ్ళి తమ ఆధార్ కార్డ్ నెంబర్ స్థానంలో వర్చ్యువల్ ఐడిని తయారుచేసుకోవచ్చు. వివిధ సేవలు అందించడానికి Aaadhar Card నంబర్ అడిగే వివిధ సంస్థలు అతి త్వరలో ఈ వర్చ్యువల్ ఐడిని స్వీకరించడం మొదలుపెడతాయి.
ఒకసారి పూర్తిస్థాయిలో ఈ వర్చ్యువల్ ఐడిని అన్ని సంస్థలు స్వీకరించడం మొదలుపెట్టిన తర్వాత.. ప్రభుత్వ విభాగాలకు కూడా 12 సంఖ్యల అసలైన ఆధార్ నెంబర్ చెప్పాల్సిన పనిలేదు. మీరు జనరేట్ చేసుకున్న వర్చ్యువల్ ఐడిని తెలియ చేస్తే సరిపోతుంది. వేలిడేషన్ సమయంలో ఆ వర్చ్యువల్ ఐడి ఆధార్ డేటాబేస్‌లో తనిఖీ చెయ్యబడి ఆధరైజ్ అవుతుంది. జూన్ 1, 2018 లోపు దేశంలో ఆధార్ ఆధారంగా వివిధ సేవలు అందిస్తున్న సంస్థలన్నీ వర్చ్యువల్ ఐడిని స్వీకరించడం మొదలుపెట్టాలని UIDAI హెచ్చరించింది.
మీరు వర్చ్యువల్ ఐడి క్రియేట్ చేసుకోవాలంటే https://uidai.gov.in/ వెబ్సైటుకు వెళ్ళి Aadhaar Services అనే విభాగం కింద Virtual ID (VID) Generator అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతి స్క్రీన్‌లో మీ ఆధార్ నెంబర్, సెక్యూరిటీ కోడ్, OTP ఎంటర్ చేస్తే సరిపోతుంది. వర్చ్యువల్ ఐడి తయారవుతుంది.
No comments:
Post a Comment