Title of image Title of image

KVPY fellowships

కిశోర్‌ వైజ్ఞానిక్ ప్రోత్సాహ‌న్ యోజ‌న ఫెలోషిప్ అవార్డు-2018 

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ తేది: 11.07.2018.
చివ‌రితేది: 31.08.2018
           భార‌త ప్ర‌భుత్వ సైన్స్ అండ్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ కిశోర్‌ వైజ్ఞానిక్ ప్రోత్సాహన యోజ‌న కింద్ ఫెలోషిప్‌ల కోసం అర్హుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 
కిశోర్‌ వైజ్ఞానిక్ ప్రోత్సాహన యోజ‌న ఫెలోషిప్ అవార్డు-2018
అర్హ‌త‌: 
స్ట్రీమ్ - ఎస్ఏ: 
ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో మ్యాథ‌మేటిక్స్, సైన్స్‌లో 75 శాతం మార్కులు సాధించి, 2018-19 విద్యా సంవ‌త్స‌రంలో ప‌ద‌కొండో త‌ర‌గ‌తిలో చేరిన అభ్య‌ర్థులు అర్హులు. ఎంపికైన అభ్య‌ర్థులు 2020-21 విద్యా సంవ‌త్స‌రంలో బీఎస్సీ/ బీఎస్/ బ‌్యాచిల‌ర్ ఆఫ్ స్టాటిస్టిక్స్/ బ‌్యాచిల‌ర్ ఆఫ్ మ్యాథ్స్/ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్‌లో త‌ప్ప‌నిస‌రిగా చేరాల్సి ఉంటుంది.
స్ట్రీమ్ - ఎస్ఎక్స్: 
ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో మ్యాథ‌మేటిక్స్, సైన్స్‌లో 75 శాతం మార్కులు సాధించి, 2018-19 విద్యా సంవ‌త్స‌రంలో ప‌న్నెండో త‌ర‌గ‌తిలో చేరిన అభ్య‌ర్థులు అర్హులు. ఎంపికైన అభ్య‌ర్థులు 2019-20 విద్యా సంవ‌త్స‌రంలో బీఎస్సీ/ బీఎస్/ బ‌్యాచిల‌ర్ ఆఫ్ స్టాటిస్టిక్స్/ బ‌్యాచిల‌ర్ ఆఫ్ మ్యాథ్స్/ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్‌లో త‌ప్ప‌నిస‌రిగా చేరాల్సి ఉంటుంది.
స్ట్రీమ్ - ఎస్‌బీ: 
ఇంట‌ర్మీడియ‌ట్‌లో సైన్స్ స‌బ్జెక్టుల్లో 60 శాతం మార్కులు సాధించి 2018-19 విద్యా సంవ‌త్స‌రంలో బీఎస్సీ/ బీఎస్/ బ‌్యాచిల‌ర్ ఆఫ్ స్టాటిస్టిక్స్/ బ‌్యాచిల‌ర్ ఆఫ్ మ్యాథ్స్/ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్ కోర్సుల్లో మొద‌టి ఏడాదిలో చేరిన అభ్య‌ర్థులు అర్హులు.

ఫెలోషిప్: నెల‌కు రూ.5000-7000 వ‌ర‌కు చెల్లిస్తారు.


ఎంపిక: ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగా.


ఆప్టిట్యూడ్ టెస్ట్ తేది: 04.11.2018

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.


          New-09-june.gif (1806 bytes) 









No comments:

Post a Comment