AIM OF THE ORGANISATION
The Anti-Corruption Bureau is a
specialized agency constituted for tackling the problem of corruption in
various departments of the Government. The Bureau registers the cases against
the public servants under the provisions of Prevention of Corruption Act,
1988. The Bureau also conducts enquiries basing on the information received
through petitions from Government, Vigilance Commission, Lok Ayukta and General
Public.
|
Report
On Corruption Online:
వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేయుటకు నo : 9440446106
(TOLL FREE No. : 1064)
Warangal Range
|
M.Kiran Kumar
FAC Dy. Supdt. of Police, Anti-Corruption Bureau, 1-8-289, Near Ekasila Park, Balasamudram, Hanumankonda |
0870-2577510
9440808108 |
08702546678
dsp_acb_wrl@telangana.gov.in |
HEAD OFFICE CONTACT DETAILS
S.No.
|
NAME
|
DESIGNATION
|
CELL NO
|
TELEPHONE
|
E-MAIL ID
|
1
|
Dr.J.Purnachandra Rao,IPS
|
Director General
|
-
|
04023251501
|
|
2
|
Sri.A.Satyanarayana,IPS
|
Additional Director
|
9493193236
|
04023559034
|
|
3
|
Sri N.V.Srinivas
|
Joint Director
|
9440446144
|
04023251510
|
S.No.
|
Questions & Answers
|
1.
|
అవినీతిని నిరోధించడానికి ఏ.సి.బి. ఏమి చేస్తుంది?
|
జవాబు.
|
అవినీతికి సంబంధించిన ప్రజల ఫిర్యాదుల మీద విచారణ చేపట్టి భాద్యులైన వారి మీద చట్ట ప్రకారం చర్యలు చేపడుతుంది.
|
2.
|
అవినీతి నిరోధక శాఖ ఎటువంటి కేసులను దర్యాప్తు చేస్తుంది?
|
జవాబు.
|
అవినీతి నిరోధక శాఖ ట్రాప్ కేసులు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు మరియు నేరపూరిత ప్రవర్తనకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేస్తుంది.
|
3.
|
ట్రాప్ (వల వేసి పట్టుకొనే) కేసు అంటే ఏమిటి?
|
జవాబు.
|
ఏ వ్యక్తి అయినా తనను ప్రభుత్వ అధికారి లంచం ఆడిగినట్లు వ్రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఆ అధికారిని లంచం తీసుకుంటున్నప్పుడు వలవేసి పట్టుకొని చట్ట ప్రకారం చర్య తీసుకొనడం.
|
4.
|
ఆదాయానికి మించిన ఆస్తుల కేసు అంటే ఏమిటి?
|
జవాబు.
|
ఏ అధికారి అయినా అక్రమ మార్గంలో తన చట్టబద్దమైన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకుంటే అవినీతి నిరోధక చట్ట ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు చేపట్టడం.
|
5.
|
నేర పూరిత ప్రవర్తన కేసు అంటే ఏమిటి?
|
జవాబు.
|
ఏ అధికారి అయినా తన అధికారాన్ని దుర్వినియోగ పరిచి ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగిస్తే నేరపూరిత ప్రవర్తన కలిగినట్లుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం.
|
6.
|
అవినీతి నిరోధక శాఖ ఆకస్మిక తనిఖీలు చేబడుతుందా?
|
జవాబు.
|
ఏదైనా ప్రభుత్వ కార్యాలయములో అవినీతి జరుగుతున్నది అని నిర్దిష్టమైన సమాచారం అందితే అవినీతి నిరోధక శాఖ ఆకస్మిక తనిఖీలు చేపట్టి సాక్ష్యాధారాలు సేకరించి తదుపరి విచారణ చేపడుతుంది.
|
7.
|
ఏ.సి.బి. కి అవినీతికి సంబంధించిన సమాచారం అందించే వ్యక్తి తన వివరాలను తెలియజేయాలా?
|
జవాబు.
|
ఏ వ్యక్తి అయినా అవినీతికి సంబంధించిన సమాచారాన్ని తన వివరాలు చెప్పకుండానే అవినీతి నిరోధక శాఖకు అందించవచ్చు. కానీ లంచం అడిగిన (ట్రాప్) కేసులలో తప్పనిసరిగా తెలియజేయవలెను.
|
8.
|
ఫిర్యాదుదారు తప్పనిసరిగా అవినీతి నిరోధక శాఖ కార్యాలయానికి రావలసి ఉంటుందా?
|
జవాబు.
|
లంచానికి సంబంధించి వల వేసి పట్టుకొనే కేసుల (ట్రాప్ కేసుల) లో మాత్రమే ఫిర్యాదు దారుడు ఏ.సి.బి. కార్యాలయానికి వచ్చి వ్రాత పూర్వకంగా ఫిర్యాదు చేయవలసి ఉంటుంది. మిగిలిన కేసుల సమాచారాన్ని ఇచ్చే వ్యక్తులు అవినీతి నిరోధక శాఖ కార్యాలయానికి రావలసిన అవసరం లేదు.
|
9.
|
అవినీతి నిరోధక శాఖ ఎటువంటి సమాచారం మీద విచారణ చేపడుతుంది?
|
జవాబు.
|
అవినీతికి సంబంధించిన నిర్దిష్టమైన సమాచారం ఆధారంగా మాత్రమే చర్యలు చేపడుతుంది.
|
10.
|
ఏదైనా ప్రభుత్వ ఆఫీసుకు పనిమీద వెళితే ఏ అధికారైన లంచం అడిగితే ఏసి బి కి ఏ విధంగా ఫిర్యాదు చేయాలి?
|
జవాబు.
|
ప్రభుత్వ అధికారి ఎవరైనా పని చేయడానికి లంచం అడిగితే సదరు వ్యక్తి ఏసిేబి ఆఫీసుకు వచ్చి జరిగిన విషయాన్నంతటిని వ్రాత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ఆ ఫిర్యాదు మీద ఏసీబీ అధికారులు విచారణ చేసి, చట్ట ప్రకారం చర్య తీసుకుంటారు.
|
11.
|
ప్రభుత్వ ఉద్యోగి మధ్యవర్తి ద్వారా లంచం తీసుకొంటే చర్య తీసుకోవచ్చా?
|
జవాబు.
|
అటువంటి సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగితో పాటు మధ్యవర్తి పై కూడా చర్య తీసుకోబడుతుంది.
|
12.
|
లంచం కేసులో ( ట్రాప్ ) ఫిర్యాదు చేస్తే లంచం డబ్బులు ఎవరు సమకూరుస్తారు?
|
జవాబు.
|
లంచం కేసులో ఫిర్యాదు దారుడే లంచం డబ్బులను సమకూర్చుకోవలసి ఉంటుంది. లంచం డబ్బులు సాక్ష్యంగా న్యాయస్థానంలో ఉంచబడుతుంది. కావున ఫిర్యాదు దారునికి కేసు నమోదు చేసిన తరువాత అతను లంచంగా సమకూర్చిన మొత్తానికి సమానమైన సొమ్మును ప్రభుత్వం నుండి తిరిగి ఇవ్వబడుతుంది.
|
13.
|
అవినీతి నిరోధక శాఖ కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి?
|
జవాబు.
|
హైదరాబాదు నగరంలో,
బంజారా హిల్స్,
రోడ్ నెంబర్ 12లో ప్రధాన కార్యాలయం ఉంది. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా అవినీతి నిరోధక శాఖ కార్యాలయాలు ఉన్నాయి. అదే విధంగా హైద్రాబాదు, రంగా రెడ్డి జిల్లా లకు సంబంధించిన ఏసి బి కార్యాలయాలు ఎగ్జిబిషన్ గ్రౌండు దగ్గర, నాంపల్లిలో ఉన్నవి.
|
14.
|
అవినీతికి సంబంధించిన సమాచారాన్ని ఏ విధంగా ఏ.సి.బి. కి తెలియజేయవచ్చు?
|
జవాబు.
|
అవినీతికి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత ఏ.సి.బి. కార్యాలయానికి నేరుగా గాని, ఫోను లేదా ఉత్తరం ద్వారా గాని, ఏ.సి.బి. వెబ్ సైట్ నందు గాని, ఈమెయిల్ ద్వారా గాని, వాట్సాప్ ద్వారా గాని, ఫేస్ బుక్ ద్వారా గాని, మరియు టోల్ ఫ్రీ నెంబరు 1064 ద్వారా తెలియజేయవచ్చు.
|
15.
|
ఫిర్యాదుదారుడు ఫిర్యాదును ఏ భాషలోనైనా ఇవ్వవచ్చా?
|
జవాబు.
|
ఫిర్యాదు దారుడు ఫిర్యాదును ఏ భాషలోనైనా ఇవ్వవచ్చు
|
16.
|
సమాచారం ఇచ్చిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచబడతాయా?
|
జవాబు.
|
అవును, గోప్యంగా ఉంచబడతాయి.
|
If you have any other questions please contact the nearest ACB Officer for clarifications.The telephone numbers can be found at Contact Us.
CONTACT US
Tollfree No.:1064, Landline Nos. 040-23251555
Complaints/Information can now also be sent by email to : dg_acb@telangana.gov.in
HOME II ABOUT US II ACTs & RULES II JUDGMENTS II RTI ACT II FAQs II LINKS II REPORT CORRUPTION
No comments:
Post a Comment