Title of image Title of image

Saturday, 8 April 2017

మంత్రి చందూలాల్‌ను కలిసిన పత్తిపల్లి వాసులు..

తమకు డబుల్ బెడ్‌రూం ఇళ్లతో పాటు దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీని తమకు మంజూరు చేయాలని కోరుతూ మండలంలోని పత్తిపల్లి గ్రామ దళితులు మంత్రి చందూలాల్‌ను ఆయన స్వగ్రామం సారంగపల్లిలో కలిసిశారు. ఈ మేరకు వారు మంత్రికి సమస్యలను వివరించారు.

స్పందించిన మంత్రి అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తుందని తెలిపారు. ఇళ్లు రాలేదని ఎవరూ నిరాశ చెందొద్దన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, మూడు ఎకరాల భూ పంపిణీని పత్తిపల్లి గ్రామంలో త్వరలో చేడుతామని ఆయన హామీ ఇచ్చారు. గ్రామంలో ఎవరైనా డబ్బులు ఇస్తే ఇళ్లు ఇప్పిస్తామని, భూమి ఇప్పిస్తామని చెబితే గుడ్డిగా నమ్మి మోసపోవద్దని అన్నారు. ఇలా ఎవరైనా ప్రవర్తిస్తే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా డబుల్‌బెడ్‌రూం, మూడు ఎకరాల భూ పంపిణీ ప్రభుత్వం అందిస్తుందని, దీనిని అందరూ గుర్తించాలని అన్నారు.

మంత్రిని కలిసిన వారిలో ఇనుముల వెంకటమ్మ, పొన్నాల పద్మ, ఇనుముల కవిత, పొన్నాల లక్ష్మీ, పారిజాతం, లలిత, కమల, రాధ, రమ, కొమురక్క, సమ్మక్క తదితరులు ఉన్నారు.





No comments:

Post a Comment